పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున హతమయ్యారు. ఈ దాడుల అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(Ajit Doval) ప్రపంచ దేశాలకు భారత్ వైఖరిని వివరించారు. భారత్‌కు యుద్ధం చేసే ఉద్దేశం లేదని.. కానీ పాక్ దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్టు ఆయన తెలిపారు.
యూఎస్, యూకే, రష్యా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, యూఏఈ, జపాన్, చైనా లాంటి కీలక దేశాల విదేశాంగ అధికారులు, సలహాదారులతో ఫోన్ కాల్ ద్వారా సంప్రదింపులు జరిపారు. అలాగే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, యూకే జోనాథన్ పావెల్, చైనా మంత్రి వాంగ్ యి, ఫ్రెంచ్ అధ్యక్ష సలహాదారు ఇమ్మాన్యుయేల్ బోనేతో పాటు, ఇతర దేశాధికారులకు ఈమేరకు వెల్లడించారు.