జ్వరం ఎంతకీ తగ్గదు. దగ్గు, బ్రీతింగ్ సమస్యలు.. రీకరవర్ కావాలంటే చాలా టైం పడుతోంది. ఇదీ కొత్త ఫ్లూ లక్షణాలు. దేశంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలూ ఫ్లూతో మూలుగుతున్నాయి. చాలా పెద్ద సంఖ్యలోఈ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ వైర్‌సతో సుదీర్ఘ పోరాటం జరిపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా దాదాపు అదే లక్షణాలతో మరోసారి ఇబ్బంది ఎదురవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజా కేసులకు H3N2 వైరస్ కారణమని తెలుస్తోంది.
- Advertisement -
మాస్కులు ధరించటం, పారాసిటమల్ లాంటి సింప్టమాటిక్ మెడిసిన్స్ వేసుకోవాలి. హోలీ పండుగ కాబట్టి జనాల్లోకి పెద్దగా వెళ్లి అందరికీ ఈ ఫ్లూను అంటించకండి.