Thursday, September 19, 2024
Homeనేషనల్All-Party Meeting: రేపు అఖిల‌ప‌క్ష స‌మావేశం.. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేదెవ‌రంటే?

All-Party Meeting: రేపు అఖిల‌ప‌క్ష స‌మావేశం.. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేదెవ‌రంటే?

All-Party Meeting: 2023 సెప్టెంబ‌ర్ నెల‌లో జ‌రిగే జీ-20 సదస్సుకు భార‌త్ ఆతిథ్య‌మివ్వ‌నుంది. ఈ సంద‌ర్భంగా స‌ద‌స్సుకు సంబంధించి సూచ‌న‌లు, స‌ల‌హాలు, చ‌ర్చ‌లు, వ్యూహాల‌ను ఖ‌రారు చేసుకునేందుకు కేంద్రం సోమ‌వారం అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఈ స‌మావేశంలో పాల్గొని స‌లహాలు, సూచ‌న‌లు అంద‌జేయాల‌ని ఇప్ప‌టికే పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌హ్లాద్ జోషి దేశ‌వ్యాప్తంగా 40 పార్టీల అధ్య‌క్షులకు ఆహ్వానం ప‌లికారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి విదేశాంగ మంత్రి జై శంక‌ర్ కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశాలున్నాయి.

- Advertisement -

ఇండోనేషియా బాలిలో న‌వంబ‌ర్ నెల‌లో జీ-20 స‌ద‌స్సు జ‌రిగింది. అయితే ఈ స‌ద‌స్సు అనంత‌రం అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను భార‌త్ కు అప్ప‌గించారు. జీ20 స‌ద‌స్సు సమయంలో.. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 32 వేర్వేరు రంగాలలో 300 సమావేశాలను నిర్వహిస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం ప్రకారం.. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న జీ-20 సమ్మిట్ భారతదేశం నిర్వహించే అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాలలో ఒకటి. దేశం అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు.. రుణ స్థిరత్వం, విపత్తు, వాతావరణం తట్టుకునే మౌలిక సదుపాయాలను సృష్టించడంపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తుంది.

రేపు జ‌రిగే స‌మావేశంకు తెలుగు రాష్ట్రాల్లోని టీఆర్ఎస్‌, వైసీపీ, తెలుగు దేశం పార్టీల‌కు ఆహ్వానం అందింది. అయితే వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ స‌ద‌స్సుకు హాజ‌రుకానున్నారు. అదేస‌మ‌యంలో టీడీపీ అధినేత‌సైతం ఈ స‌ద‌స్సులో పాల్గోనున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు టీఆర్ ఎస్ అధినేత, టీఎస్ సీఎం కేసీఆర్ సైతం ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఆదివారం సాయంత్రంకు ప‌శ్చిమ బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మ‌మ‌త బెన‌ర్జీ ఢిల్లీకి చేరుకుంటారు. మిగిలిన రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు, పార్టీల అధ్య‌క్షులు సైతం పాల్గోనున్నారు.

జీ20 లేదా జీ గ్రూప్ ఆఫ్ 20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ ఫోరమ్. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, UK, US మరియు యూరోపియన్ ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News