Saturday, November 15, 2025
Homeనేషనల్Amit Shah: వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ఉగ్రవాదులకు అమిత్ షా వార్నింగ్

Amit Shah: వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ఉగ్రవాదులకు అమిత్ షా వార్నింగ్

ఉగ్రవాదులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారికి కచ్చితంగా తగిన శిక్ష లభిస్తుందన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకుని శిక్షిస్తామన్నారు. పిరికివారిగా దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే అది పొరపాటే అన్నారు.

- Advertisement -

నరేంద్ర మోదీ సర్కార్ ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరికలు జారీ చేశారు. అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో కేవలం 140 కోట్ల మంది భారతీయులే కాకుండా యావత్ ప్రపంచం భారత్‌కు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad