Sunday, May 19, 2024
Homeనేషనల్Anand Mahindra : ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ వైర‌ల్‌.. వాడి త‌మ్ముడా ఏందీ..!

Anand Mahindra : ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ వైర‌ల్‌.. వాడి త‌మ్ముడా ఏందీ..!

బ్రాండ్ అంటే చాలు.. ఇంకేం ఆలోచించ‌కుండా కొనేస్తుంటారు చాలా మంది. దుస్తులు, ఇంట్లో వాడే వ‌స్తువులు కూడా బ్రాండెడ్ వే కావాల‌ని అంటుంటారు. ఒక‌ప్పుడు బాగా డ‌బ్బులున్న వాళ్లే బ్రాండెడ్ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేవారు. అయితే ఇటీవ‌ల కాలంలో మ‌ధ్యత‌ర‌గ‌తి వారికి కూడా ఈ బ్రాండ్ పిచ్చి పాకింది. బ్రాండెడ్ వ‌స్తువుల‌కు య‌మా గిరాకీ ఏర్ప‌డింది. దీంతో మార్కెట్ల‌లోకి న‌కిలీ బ్రాండ్లు పుట్టుకొచ్చాయి.

- Advertisement -

ఒరిజిన‌ల్ బ్రాండ్‌కు న‌కిలీ బ్రాండ్‌కు ఒక అక్ష‌రం లేదా రెండు అక్ష‌రాలే తేడాలు ఉంటుండ‌డంతో చాలా మంది గుర్తించ‌డంలో పొర‌బాటు ప‌డుతుంటారు. బాగా గ‌మ‌నిస్తే త‌ప్ప అస‌లు బ్రాండ్ ఏదో న‌కిలీ బ్రాండ్ ఏదో గుర్తించ‌డం క‌ష్టం. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా న‌కిలీ బ్రాండ్ పై వినియోగ‌దారుల‌ను అప్ర‌మ‌త్తం చేసేలా తాజాగా ఓ ట్వీట్ చేశారు.

ప్ర‌ముఖ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ న‌కిలీ బ్రాండ్‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసి త‌న‌దైన శైలిలో కామెంట్ చేసి న‌వ్వులు పూయించారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోలో ఉన్న షూ చూడ‌గానే అచ్చం అడిడాస్ సంస్థ‌దే అన్న‌ట్లుగా ఉంది. సంస్థ లోగోతో స‌హా అదే విధంగా క‌నిపిస్తుంది. అయితే.. పేరు మాత్రం అడిడాస్ బ‌దులుగా అజిత్‌దాస్ ఉంది. “ఈ లాజిక్ స‌రైందే. దీనిని చూస్తుంటే ఆదికి అజిత్ అనే సోద‌రుడు ఉన్నాడేమో అనిపిస్తుంది. వ‌సుదైక కుటుంబం ” అని చ‌మ‌త్కారంగా రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఆనంద్ ట్వీట్‌పై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News