Sunday, May 19, 2024
Homeచిత్ర ప్రభSunil Shetty : బాలీవుడ్ హీరోలపై ఒకప్పటి స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..

Sunil Shetty : బాలీవుడ్ హీరోలపై ఒకప్పటి స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -

Sunil Shetty : ఇటీవల బాలీవుడ్ సినిమాలు, నటులు విమర్శలకి గురవుతున్నారు. ముఖ్యంగా సినిమాల విషయంలో. బాలీవుడ్ నటులకి వరుస ఫ్లాప్స్ వస్తుండటంతో అంతా వారిని విమర్శిస్తున్నారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరో, సీనియర్ నటుడు సునీల్ శెట్టి బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు హీరోగా బాలీవుడ్ లో నటించిన సునీల్ శెట్టి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు.

తాజాగా తాను నటించిన ఓ సిరీస్ రిలీజ్ కి ఉండటంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ”ఇప్పటి హీరోలకి అభద్రతా భావం ఎక్కువైంది. కెరీర్ ఎన్నేళ్లు ఉంటుందో, ఉన్నప్పుడే సంపాదించుకోవాలి అని డబ్బుల మీద ఫోకస్ చేస్తున్నారు. సినిమాల మీద, కథల విషయాల కంటే కూడా డబ్బుల గురించే ఆలోచిస్తున్నారు. ప్రేక్షకులకి ఏం కావాలి అని ఏ హీరో కూడా పట్టించుకోవట్లేదు. ఇలా ఉంటే సినిమాలు కచ్చితంగా ఫ్లాప్స్ అవుతాయి” అని అన్నారు.

దీంతో సునీల్ శెట్టి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చగా మారాయి. మరి సునీల్ చేసిన వ్యాఖ్యలకి బాలీవుడ్ హీరోలు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News