ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి ఆతిశీ(Atishi) రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను లెఫ్టెనెంట్ గవర్నర్ వి.కె సక్సేనాకు సమర్పించారు. మరోవైపు 7వ అసెంబ్లీని రద్దు చేస్తూ ఎల్జీ ఆదేశాలు జారీ చేశారు. కాగా శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలు, ఆప్ 22 స్థానాలు దక్కించుకున్నాయి. మెజార్టీ కంటే 12 స్థానాలు ఎక్కువగా గెలుచుకున్న బీజేపీ త్వరలోనే దేశ రాజధానిలో అధికారం చేపట్టనుంది.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/GjUx6z-boAAmpPp.png)