Monday, February 24, 2025
Homeనేషనల్Water Crisis: తాగునీటిని వృథా చేస్తున్నారా..? రూ.5వేలు కట్టాల్సిందే

Water Crisis: తాగునీటిని వృథా చేస్తున్నారా..? రూ.5వేలు కట్టాల్సిందే

ఈసారి దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎండల ధాటికి భూగర్భ జలాలుఅడుగంటిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంచి నీటి(Drinking Water) కొరత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మెట్రో సిటీల్లో అయితే తాగునీటి కోసం ప్రజలు కటకటలాడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరు(Bengaluru)లో అయితే వేసవి కాలం కంటే సాధారణ నెలల్లో కూడా నీటి సమస్య(Water Crisis) ఉంటుంది.. ఇక ఎండాకాలం వచ్చింది నీటి సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ప్రస్తుతం బెంగళూరులో 300 నుంచి 500 మిలియన్ లీటర్లు నీటి కొరత ఉందని బెంగళూరు వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్ వాషింగ్, గార్డెనింగ్, డెకరేటివ్ ఫౌంటెన్లు వంటి అనవసరమైన వాటితో పాటు షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో కూడా తాగునీటిని ఉపయోగించకూడదని వార్నింగ్ ఇచ్చారు. ఇలా చేస్తే రూ. 5వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ప్రతిసారీ రూల్స్ అతిక్రమిస్తే రూ.500 పెంచుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. ఎవరైనా నీటిని వృథా చేసినట్లు కనిపిస్తే వెంటనే 1916కి డయల్ చేసి బోర్డుకు తెలియజేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News