Saturday, October 5, 2024
Homeనేషనల్BJY: రాహుల్ ఇప్పుడు ఓ సీరియస్ లీడర్-షాట్ గన్ కామెంట్స్

BJY: రాహుల్ ఇప్పుడు ఓ సీరియస్ లీడర్-షాట్ గన్ కామెంట్స్

సీరియస్ లీడర్ గా రాహుల్ గాంధీ ఆవిర్భవించారని , ఆయనకు ప్రధాన మంత్రి అయ్యే సత్తా ఉందని ప్రముఖ బాలీవుడ్ నటుడు శతృఘన్ సిన్హా కితాబిచ్చారు. గతంలో బీజేపీ ఎంపీగా వ్యవహరించిన శతృఘన్ కు మోడీ-షా ద్వయంతో పడకపోవటంతో ఎప్పుడూ బీజేపీపై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఈయన టీఎంసీ ఎంపీ శత్రుఘన్ ఉండటం విశేషం. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో శతృఘన్ పాల్గొంటున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలపై రాహుల్ పాదయాత్ర ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని శతృఘన్ జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News