Saturday, July 27, 2024
Homeఇంటర్నేషనల్Lay-Offs: ఉద్యోగం ఊడింది..అయినా అమెరికాలోనే ఉండిపోవాలంటే ఎలా?

Lay-Offs: ఉద్యోగం ఊడింది..అయినా అమెరికాలోనే ఉండిపోవాలంటే ఎలా?

ఓవైపు ఉద్యోగాలు ఊడుతున్నాయి.. మరోవైపు అమెరికాలో ఉండిపోవటం ఎలా అన్నది ఐటీ ప్రొఫెషనల్స్ కు సరికొత్త సవాలుగా మారింది. దీనికి పరిష్కారం కనుగొనేందుకు అన్నట్టు అమెరికాలోని ఇండియన్ ఐటీ ఉద్యోగులు వాట్స్ గ్రూప్స్ గా ఏర్పడ్డారు. ఈ సమస్యపై మేధోమధనం చేసుకుంటో సలహాలు, సూచనలు చేసుకుంటూ ఒకరికి ఒకరు అన్నట్టుగా మారుతున్నారు.

- Advertisement -

అమెరికా దేశలో వేలాదిమంది ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీరంతా వివిధ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. కానీ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా వంటి టెక్ దిగ్గజాలంతా లే ఆఫ్స్ ను పెద్ద ఎత్తున చేపడుతున్న నేపథ్యంలో కొలువు ఊడినా ఇక్కడే ఉండిపోవటం ఎలా అన్నది వీరందరికీ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. ఓవైపు కొత్త ఉద్యోగం సంపాదించుకుని మరోవైపు అక్కడే సెటిల్ అయిపోయేందుకు వీరు సర్వం ఒడ్డుతున్నారు.

ఈ వ్యవహారంపై వాషింగ్టన్ పోస్ట్ ఆసక్తికరమైన వరుస కథనాలు ప్రచురిస్తోంది. వాషింగ్టన్ పోస్ట్ లెక్క ప్రకారం.. గతేడాది నవంబర్ మొదలు ఇప్పటి వరకు కనీసం 200,000 ఐటీ వర్కర్లను గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి సంస్థలు టర్మినేట్ చేశాయి.

ఇండస్ట్రీ ఇన్ సైడర్స్ చెప్పే విషయం మరింత ఆసక్తిగా ఉంది. వీరి లెక్కల ప్రకారం కనీసం 30-40 శాతం ఇండియన్ ఐటీ ఉద్యోగులను దిగ్గజ కంపెనీలు సాగనంపుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది H-1B, L1 వీసాలపై పనిచేస్తున్నవారే కావటం విశేషం.

H-1B వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా, దీని కింద అమెరికన్ కంపెనీలు ఉద్యోగుల నియామకం చేసుకోవచ్చు అది కూడా థియోరెటికల్, టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ రంగంలోనే ఇది అనుమతిస్తారు. టెక్నాలజీ ఆధారిత కంపెనీలన్నీ ఇలాంటి ఉద్యోగులనే నియమించుకున్నాయి. వీరిలో అత్యధికులు చైనా, ఇండియా నుంచి వచ్చినవారే ఉంటారు.

అదే L1ఏ, L1బీ వీసాలైతే ఇవన్నీ టెంపరరీగా ఉంటాయి లేదా కంపెనీలోని ఇంట్రా ట్రాన్స్ఫర్స్ లో భాగం అంతే. ఉదాహరణకు ఓ ఉద్యోగి సీత (గోప్యత కోసం పేరు మార్చాం)ను అమెజాన్ కంపెనీ అమెరికాకు పంపింది. అది కూడా 3 నెలల క్రితం..తాజాగా ఆమెకు తన లాస్ట్ వర్కింగ్ డే మార్చ్ 20 అని కంపెనీ తేల్చి చెప్పింది. దీంతో సీతకు ఏం చేయాలో తోచక, కొత్త ఉద్యోగం వేటలో ఓవైపు, అమెరికాలోనే ఉండిపోయేలా వర్క్ పర్మిట్ వీసా కోసం కుస్తీ పడుతోంది. ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులను సాగనంపే పనిలో ఉన్నప్పుడు కొత్త ఉద్యోగం దొరకటం కాస్త కష్టమైన పనే. అలాగని ఇండియాకు వస్తే తమ పరువు, హోదా పోతుందనే బెంగ వీరిని మానసికంగా పట్టి పీడిస్తోంది. కొందరు అమెరికా మోజులో పడి ఇలా కొట్టుమిట్టాడుతున్నారని టెక్ కంపెనీ ఇన్ సైడర్స్ బాహాటంగానే విమర్శిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News