ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు సమావేశాలు (Parliament Sessions) వాయిదా పడ్డాయి. సౌర విద్యుత్తును పొందేందుకు లంచాలు చెల్లించారనే ఆరోపణలపై అమెరికా కోర్టులో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani), ఇతరులపై నేరారోపణల అంశాలను దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ అంశంపై చర్చించాలని లోక్ సభ, రాజ్య సభలలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకి దిగారు.
- Advertisement -
ఈ క్రమంలో సభాపతులు సభలను నవంబర్ 27కి వాయిదా వేశారు. సభలు తిరిగి బుధవారం మరోసారి సమావేశం కానున్నాయి. 1949లో రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పార్లమెంటు సమావేశాలు (Parliament Sessions) జరగవు.