ఎంపీ వద్దిరాజు పార్లమెంటులో మణిపూర్ ప్రజల్ని రక్షించాలంటూ, ఢిల్లీ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటులో బీఆర్ఎస్ ఆందోళన చేశారు.
మణిపూర్ రాష్ట్రాన్ని రక్షించాలి. ఢిల్లీ ఆర్డినెన్సును ఉపసంహరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినదించిన బిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన బిఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ సభ్యులు రవిచంద్ర బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోకసభలో బిఆర్ఎస్ పక్ష నాయకులు నాగేశ్వరరావు,సహచర ఎంపీలు సంతోష్ కుమార్, దామోదర్ రావులతో కలిసి ఆందోళనలో అగ్రభాగాన నిలిచారు. అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్ రాష్ట్రాన్ని, అక్కడి ప్రజల్ని రక్షించాలంటూ, ఉద్యోగులపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించాలని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశాలపై బిజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని పార్లమెంటులో టిఆర్ఎస్ నిలదీసింది రక్షించాలి, రక్షించాలి మణిపూర్ రాష్ట్రాన్ని, అక్కడి ప్రజల్ని రక్షించాలి, రక్షించాలి. ఉపసంహరించాలి,ఉపసంహరించాలి ఉద్యోగులపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించాలి, ఉపసంహరించాలి.. అంటూ బిఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి ముక్తకంఠంతో నినదించారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ ఆందోళనలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, తన సహచర ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, కే.ఆర్.సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి, పీ.రాములు,మన్నె శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి అగ్రభాగాన నిలిచారు.
BRS in Parliament: మణిపూర్ ప్రజల్ని రక్షించాలంటూ బీఆర్ఎస్ ఆందోళన
సంబంధిత వార్తలు | RELATED ARTICLES