Friday, April 4, 2025
Homeనేషనల్BRS Maharashtra: హోం మంత్రి సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరిన మహరాష్ట్ర...

BRS Maharashtra: హోం మంత్రి సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరిన మహరాష్ట్ర మైనార్టీలు

దేశవ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు

దేశవ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. హోంమంత్రి సమక్షంలో మహారాష్ట్రకు చెందిన కొందరు మైనార్టీలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బంజారా హిల్స్ లోని హోం మంత్రి నివాసంలో మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఆశిఫుద్దీన్ , సంయుద్దీన్ ,షెమ్ము ,అమర్దీప్ మైక్వాడ్ మయూర మేడే , సయ్యద్ ముదాసీర్, అబ్దుల్ రహీం, యాసీన్ తదితరులను పార్టీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆయన ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ…. రానున్న ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ పార్టీ దేశవ్యాప్తంగా విజయం సాధిస్తుందని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు బద్రుద్దీన్, ఆరిఫ్ ఉద్దీన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News