ఈ రోజుల్లో ఉద్యోగులుకు జీతాలు ఇవ్వటానికే సంస్థలు లబోదిబోమంటున్నాయి. కరెక్టు సమయానికి జీతాలు వస్తే చాలు అనుకుంటూ ఉంటారు ఆయా సంస్థలోని ఉద్యోగులు. కానీ మనం చెప్పుకోబోయే ఈ సంస్థ యాజమాని వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఏకంగా తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఊహించని రీతిలో ఆఫర్ ఇచ్చారు. అదేంటో చూద్దాం పదండి.
చైనాకు చెందిన హెనాన్ మైనింగ్ క్రేన్ కో. లిమిటెడ్ కంపెనీ యాజమాని తన ఉద్యోగులు ఊహించని విధంగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ సంవత్సరాంతపు బోనస్ డబ్బును ప్రత్యేకంగా ప్రకటించారు. అది చూసి ఉద్యోగుల ఆనందానికి అవధుల్లు లేకుండా పోయాయి.
ఇంతకు ఏం చేశాడంటే.. సూమారుగా 100 మిలియన్ యువాన్లు.( మన లెక్క ప్రకారం 70 కోట్ల రూపాయలు) కుమ్మరించేశాడు. ఇంకేముంది చాలా హ్యాపీగా ఉద్యోగులందర్నీ పిలిపించి ఆ డబ్బును చూపించేశాడు. మీరంతా క్యూలో నిలబడి ఓ 15 నిమిషాల పాటు కుమ్మరించిన డబ్బును లెక్కపెట్టుకుని తీసుకోవచ్చని చెప్పేశాడు.
అంతే ఆయన ఇలా చెప్పాడో లేదో నిమిషాల్లోనే ఉద్యోగులంతా ఎగబడి తమ చేతులకు అందినకాడికి లెక్కపెట్టుకుని తీసేసుకున్నారు.ఇందులో ఒక ఉద్యోగి 100,000 UN సేకరించినట్లు తెలిసింది, అంటే సుమారు రూ. 12.07 లక్షలు అన్నమాట. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇలాంటి అవకాశం మాకెప్పుడు వస్తుందోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా వీళ్లకు పండగే అని అంటున్నారు.