అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చేలా ఉంటున్నాయి.. ఈరోజు జరుగుతున్న జమ్ము కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఆధిక్యంలో కాంగ్రెస్ కూటమి..
జమ్మూ కాశ్మీర్ లో అక్కడి ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ దూకుడూ చూపుతూ, తొలి స్థానంలో దూసుకుపోతోంది. ఇప్పటికే 50 స్థానాల్లో ఇక్కడ ఎన్.సి. లీడింగ్ లో ఉండగా రెండవ స్థానంలో ఉన్న బీజేపీ కేవలం 28 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇక పీడీపీ మాత్రం థర్డ్ ప్లేస్ లో 4 సీట్లతో లీడింగ్ లో ఉంది. జమ్ము కాశ్మీర్ లో ఇతర పార్టీలు కేవలం 8 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి దూకుడుకు కమలనాథులు ఇక్కడ చతికిల పడటం ఖాయంగా ప్రస్తుతానికి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.
హర్యానాలోనూ సేమ్ సీన్..
హర్యానా విషయానికి వస్తే 46 స్థానాల్లో లీడింగ్ లో ఉంటూ ఆదినుంచి కాంగ్రెస్ పార్టీ తన పై చేయి చాటుకుంటోంది. రెండో స్థానంలో బీజేపీ 36 సీట్లలో లీడింగ్ లో ఉంది. మరో ప్రాంతీయ పార్టీ ఐ.ఎన్.ఎల్.డి కేవలం 3 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.
మొత్తానికి ప్రస్తుతానికి పరిస్థితంతా ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే ఉన్నాయి.