పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో జరిగిన దాడులపై సెలబ్రెటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై హింద్, భారత్ మాతాకీ జై, ఆపరేషన్ సింధూ అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు చేసినందుకు ఏపీ సీఎం చంద్రబాబు భారత సాయుధ దళాలను ప్రశంసించారు. “పహల్గామ్ ఉగ్రదాడికి వేగంగా ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల యోధులకు నేను గర్వంగా సెల్యూట్ చేస్తున్నాను. వారి అసమాన ధైర్యం, కచ్చితత్వంతో, ఉక్కు సంకల్పంతో మన దేశం తనను తాను రక్షించుకుంటుందని వారు మళ్లీ నిరూపించారు” అని ట్వీట్ చేశారు.
‘‘దశాబ్దాల సహనం… సహనం. చాలా సేపు నిశ్శబ్దాన్ని భరించిన తర్వాత, “ఆపరేషన్ సిందూర్” ద్వారా భారతదేశం మొత్తాన్ని మళ్ళీ శౌర్య స్ఫూర్తితో నింపిన త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి, వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి. హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఎల్లప్పుడూ మీతోనే ఉంటాం. జై హింద్’’. అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) హిందీలో ట్వీట్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది జైహింద్ అని మెగాస్టార్ చిరంజీవి అని ట్వీట్ చేశారు.