Saturday, November 15, 2025
Homeనేషనల్Pakistan Celebrities: సెలెబ్రెటీలకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం!

Pakistan Celebrities: సెలెబ్రెటీలకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం!

Pakistan celebrities Ban: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానెల్‌లపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆపరేషన్ సింధూర్‌పై పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేయడాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు అప్పట్లో పాక్‌కి చెందిన అనేక యూట్యూబ్ ఛానెల్స్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను భారత్‌లో నిషేధించింది.

- Advertisement -

అయితే ఇటీవల, నిషేధిత ఖాతాలు మళ్లీ భారత వినియోగదారులకు కనిపించడంతో సోషల్ మీడియాలో కలకలం రేగింది. బుధవారం నాడు పాకిస్థానీ సెలబ్రిటీలు హనియా అమీర్, షాహిద్ అఫ్రిది, మహీరా ఖాన్, ఫవాద్ ఖాన్, సబా కమర్, యుమ్నా జైదీ తదితరుల సోషల్ మీడియా ఖాతాలు, అలాగే హమ్ టీవీ, ARY డిజిటల్, హర్ పాల్ జియో వంటి ప్రసిద్ధ యూట్యూబ్ ఛానెల్స్ మళ్లీ ప్రత్యక్షమైనట్టు వినియోగదారులు గుర్తించారు.

ఈ పరిణామాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే మరోసారి స్పందించింది. గురువారం ఆ ఖాతాలన్నింటిపై తిరిగి నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది. ముందుగా విధించిన నిషేధాన్ని పాక్షికంగా సాంకేతిక కారణాలవల్లో లేక తాత్కాలిక లూప్‌హోల్స్ వలనో అవి మళ్లీ కనిపించాయని అంచనా వేస్తున్నారు. దీంతో కేంద్రం మరింత కఠినమైన చర్యలు తీసుకుంటూ, ఈ ఖాతాలను భారత డిజిటల్ ప్లాట్‌ఫాంల నుంచి పూర్తిగా తొలగించే దిశగా పనిచేస్తోంది.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత కేంద్రం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌పై పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ప్రముఖులు తప్పుడు కథనాలను ప్రచారం చేసినట్టు ఆరోపణలు రావడంతోనే మొదటిసారి ఖాతాలు నిషేధించబడ్డాయి. బుధవారం అకస్మాత్తుగా అవి తిరిగి కనిపించడం వల్ల సోషల్ మీడియాలో కలకలం చోటు చేసుకుంది. కొన్ని వర్గాలు భారత్ ఈ నిషేధాన్ని ఉపసంహరించిందని వదంతులు ప్రచారం చేశాయి. అయితే కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వకపోయినా, తిరిగి వాటన్నింటిపై బాన్ కొనసాగుతుందని గురువారం అధికారికంగా తెలియజేసింది. ఈ చర్యలతో కేంద్రం మరోసారి జాతీయ భద్రత, సమాచార ప్రమాణాలను కాపాడే దిశగా ఎంతటి స్థాయిలో నిఘా కొనసాగిస్తోందో స్పష్టం అయింది. ప్రజలకు తప్పుడు సమాచారం చేరకుండా నిరోధించడం, దేశ వ్యతిరేక శబ్దాలను అడ్డుకోవడం కేంద్ర లక్ష్యంగా పని చేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad