భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఛార్‌ధామ్ యాత్రను(CharDham Yatra) రద్దు చేసింది. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ యాత్రను నిలిపేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే అక్కడికి హెలికాప్టర్ సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇటీవలే భక్తుల దర్శనార్థం ఉత్తరాఖండ్‌లోని దేవాలయాల తలుపులు తెరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఛార్‌ధామ్ యాత్ర కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కానీ యుద్ధం నేపథ్యంలో భారత్‌లోని ప్రముఖ హిందూ దేవాలయలే టార్గెట్‌గా పాకిస్థాన్ డ్రోన్లతో దాడుల చేస్తున్న నేపథ్యంలో ఈ యాత్రను కొంతకాలం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బద్రినాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రికి వెళ్లే భక్తులు తమ ప్రయాణాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చార్ ధామ్ యాత్ర కొనసాగించవద్దని వెల్లడించింది.