Tuesday, December 24, 2024
Homeనేషనల్Congress: కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

Congress: కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

కేంద్ర ఎన్నికల సంఘం(CEC)పై కాంగ్రెస్(Congress) పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ చర్యల వల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలుగుతుందని పేర్కొంది. ఈమేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ సుప్రీంకోర్టు(Supreme Court)లో తాజాగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో CEC మార్పులు చేసింది. పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్, వెబ్ కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేదం విధించింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961లోని రూల్ 93(2) (ఏ) ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని పిటిషన్ దాఖలు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News