Kasturi| తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సినీ నటి, బీజేపీ మహిళా నేత కస్తూరికి కోర్టు రిమాండ్ విధించింది. అమెను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈనెల 29వరకు ఆమెకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. కోర్పు తీర్పుతో ఆమెను చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో తెలుగు వారిపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై తెలుగు సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం మధురై హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం కస్తూరి పిటిషన్ను కొట్టివేసింది. దీంతో పరారీలో ఉన్న కస్తూరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించగా.. హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆమెను అరెస్ట్ చేసి చెన్నైకు తరలించారు.