ఏదైనా శుభకార్యానికి వెళ్లేప్పుడైనా, ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్లే సమయంలో దహీ-చీనీ అంటే పెరుగు-చక్కెరను తినటం ఉత్తరాదిన సంప్రదాయంగా వస్తోంది. ఇదే సంప్రదాయాన్ని ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదర్శించటం అందరినీ ఆకట్టుకుంటోంది.
- Advertisement -
11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా రాష్ట్రపతికి బడ్జెట్ ప్రతులు అందజేశారు. రాజ్యాంగ సంప్రదాయం ప్రకారం ఇదంతా సాగుతుంది. అయితే ఇదే సమయంలో రాష్ట్రపతి ముర్ము ఆమెకు పెరుగు-చక్కెర తినిపించటం ఆసక్తిగొలుపుతోంది.
ఇలా దహీ-చినీ తిని వెళ్లి చేసిన పని మంచి ఫలితాన్నిస్తుందని, గుడ్ లక్ తెస్తుందని ఉత్తరాది ప్రజలు విశ్వసిస్తారు.