శాటిలైట్ ఇమేజెస్ చూస్తే జోషి మఠ్ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోంది. తాజాగా ఇమెజస్ ను చూసిన శాస్త్రవేత్తలు షాక్ తింటున్నారు. డేంజర్ జోన్ అయిన జోషి మఠ్ ఏకంగా 5.4 సెంటీమీటర్లు కుంచించుకుపోవటాన్ని గుర్తించారు. అదికూడా జస్ట్ 12 రోజుల్లో ఇంత మేరకు భూమి కుంచించుకుపోవటమంటే అత్యంత ప్రమాదకరమైన విషయం. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈ ఫోటోలను డిసెంబర్ 27-జనవరి 8వ తేదీ మధ్య కాలంలో క్లిక్ చేసింది.
గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో జోషిమఠ్ ఏకంగా 9 సెంటీమీటర్ల మేర కుంచించుకు పోయినా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించి, ముందస్తు చర్యలు చేపట్టకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు కేంద్రం కూడా జోషిమఠ్ పై నిమ్మకు నీరెత్తినట్టుంది. దీంతో జోషిమఠ్ లోని 25 శాతం బిల్డింగులకు చీలికలు వచ్చాయి.