DGCA Proposes Passenger-Friendly Rules: భారతదేశంలో విమాన ప్రయాణికులకు త్వరలో పెద్ద ఊరట లభించనుంది. టికెట్ క్యాన్సిలేషన్, రీఫండ్‌ల విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రయాణికులకు అనుకూలమైన కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఈ కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం, టికెట్ బుక్ చేసిన 48 గంటల వరకు ప్రయాణికులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు.
ALSO READ: Beaver Supermoon: అస్సలు మిస్ కాకండి.. కార్తిక పౌర్ణమి రోజున ఆకాశంలో అద్భుతం
ఏమిటీ “లుక్-ఇన్ ఆప్షన్”?
డీజీసీఏ ప్రతిపాదించిన ‘సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్’ (CAR) ముసాయిదా ప్రకారం, విమానయాన సంస్థలు ప్రయాణికులకు “లుక్-ఇన్ ఆప్షన్”ను అందించాలి. ఈ సదుపాయం కింద, టికెట్ బుక్ చేసిన 48 గంటల వ్యవధిలో ఎలాంటి క్యాన్సిలేషన్ ఫీజు లేదా అదనపు ఛార్జీలు లేకుండా టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. అయితే, మార్పు చేసిన టికెట్‌కు వర్తించే సాధారణ ఛార్జీల వ్యత్యాసం (ఒకవేళ ఉంటే) మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, ఈ 48 గంటల ‘లుక్-ఇన్’ సదుపాయానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. దేశీయ విమాన ప్రయాణాలకు బుకింగ్ తేదీ నుండి 5 రోజులలోపు, అంతర్జాతీయ విమానాలకు 15 రోజులలోపు ప్రయాణం షెడ్యూల్ ఉంటే ఈ ఆప్షన్ వర్తించదు. బుకింగ్ చేసిన 48 గంటలు దాటితే, సాధారణ క్యాన్సిలేషన్ ఫీజులు వర్తిస్తాయి.
ALSO READ: Coimbatore Gang Rape: కోయంబత్తూరు కామాంధులకు బుల్లెట్ రుచి.. పారిపోతుంటే కాళ్లపై కాల్పులు!
పేరు దిద్దుబాటు ఉచితం, వేగంగా రీఫండ్‌లు
మరో ముఖ్యమైన ప్రతిపాదన ఏమిటంటే, బుకింగ్ సమయంలో పేరులో స్పెల్లింగ్ తప్పులు దొర్లితే, 24 గంటలలోపు సరిచేసుకుంటే ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు.
రీఫండ్‌ల విషయంలో కూడా డీజీసీఏ స్పష్టమైన కాలపరిమితిని నిర్దేశించింది:
- క్రెడిట్ కార్డ్ చెల్లింపులు: 7 రోజులలోపు రీఫండ్ చేయాలి.
- నగదు చెల్లింపులు: ఎయిర్‌లైన్ కార్యాలయంలో తక్షణమే రీఫండ్ ఇవ్వాలి.
- ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుకింగ్: 21 పని దినాలలోగా రీఫండ్ పూర్తిచేయాలి (బాధ్యత పూర్తిగా ఎయిర్‌లైన్‌దే).
వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కారణంగా టికెట్ రద్దు చేసుకుంటే, రీఫండ్ లేదా భవిష్యత్ ప్రయాణం కోసం క్రెడిట్ షెల్ అందించే అవకాశం కూడా ఉంది. ఈ ముసాయిదా నిబంధనలపై నవంబర్ 30 వరకు భాగస్వాముల నుండి డీజీసీఏ అభిప్రాయాలను ఆహ్వానించింది.


