Sunday, November 16, 2025
Homeనేషనల్Elederly population is growing: భారత్ ‘ముసలి’దైపోతోంది..

Elederly population is growing: భారత్ ‘ముసలి’దైపోతోంది..

Elederly population: ఇప్పటికే చైనాలో ముసలివాళ్లు ఎక్కువై సతమతమవుతుంది. ఇప్పుడు భారత్‌కు అదే ముప్పు పొంచిఉందా.. అంటే అవుననే అంటున్నాయి గణాంకాలు. ఇండియాలో క్రమంగా వృద్ధుల జనాభా పెరుగుతోంది. అంతేకాదు 0-14 సంవత్సరాల వయసున్న పిల్లల సంఖ్య నిరంతరంగా తగ్గిపోతున్నదని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తన 2023 శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌(ఎస్‌ఆర్‌ఎస్‌) నివేదిక వెల్లడించింది. దేశ జనాభాలో శ్రామిక-వయో గ్రూపు (15-59 ఏళ్లు) సంఖ్య కూడా పెరుగుతున్నదని నివేదిక చెబుతోంది. దేశంలో సంతానోత్పత్తి రేటు కూడా దారుణంగా పడిపోయినట్టు నివేదికలో వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.1971లో 5.2 ఉన్న సంతానోత్పత్తి రేటు 2023లో 1.9కి తగ్గిపోగా..1971-81 కాలంలో 0 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లల నిష్పత్తి 41.2 శాతంగా..2024 నాటికి అది 24.2 శాతానికి తగ్గిపోయినట్లు నివేదిక లెక్కలు చెబుతున్నాయి. గడచిన ఐదు దశాబ్దాలలో దేశ జనాభాలో పిల్లల వాటా దాదాపు 17 శాతం తగ్గడం గమనార్హం.

- Advertisement -

జనాభా మార్పుల ప్రభావం
జనాభాలో పిల్లల సంఖ్య తగ్గడం వల్ల భవిష్యత్తులో శ్రామికశక్తి తగ్గిపోతుంది. ఇది ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకంగా మారుతుంది. చిన్న పిల్లల వల్ల కుటుంబ ఖర్చులు ఇప్పుడు తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పింఛన్లు, సామాజిక భద్రతా వ్యవస్థల భారం పెరుగుతుంది. ఒక్క సంతానం లేక అసలే పిల్లలు లేని కుటుంబాలు పెరిగే కొద్దీ వృద్ధులను చూసుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది. అయితే తక్కువ ఒకరిద్దరు పిల్లలున్న కుటుంబాలు వారి విద్య, ఆరోగ్య రక్షణ కోసం ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు.

వృద్ధ భారతం
అయితే దేశంలో 15-59 ఏళ్ల వయసున్న ప్రజల సంఖ్య పెరుగుతున్నది. 1971 నుంచి 1981 మధ్య 53.4 శాతం ఉన్న ఈ గ్రూపు సంఖ్య 1991 నుంచి 2023 మధ్య 56.3 శాతానికి పెరిగి ప్రస్తుతానికి అది 66.1 శాతానికి చేరుకుంది. ఢిల్లీలో అత్యధికంగా ఈ గ్రూపు వాటా 70.8 శాతం ఉండగా బిహార్‌లో అత్యల్పంగా 60.1 శాతంగా ఉంది. పట్టణాల్లోని జనాభాలో పనిచేసే వయసు గల ప్రజల వాటా 68.8 శాతం ఉండగా గ్రామీణ ప్రాంతాలలో అది 64.6 శాతం. జమ్ము కశ్మీరులో గ్రామీణ మహిళల వాటా 70.1 శాతం ఉంది.

వృద్ధుల్లో కేరళ టాప్
2023లో దేశ జనాభాలో 60 ఏండ్లు, అంతకు పైబడి వయసున్న వారి వాటా 9.7 శాతం ఉండగా కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 15.1 శాతం ఉంది. రెండో ప్లేసులో తమిళనాడు(14 శాతం), ఆ తర్వాతి స్థానంలో హిమాచల్‌ ప్రదేశ్‌(13.2 శాతం) ఉన్నాయి. అయితే దేశంలో పూర్తి సంతానోత్పత్తి రేటు పడిపోయింది. 1971లో 5.2 ఉండగా 2023లో అది 1.9కి చేరింది. గ్రామీణ ఢిల్లీలో మినహాయించి 0-14 ఏళ్ల వయసున్న బాలుర సంఖ్య బాలికల కన్నా ఎక్కువ. దేశంలో శిశు మరణాల రేటు(ఐఎంఆర్‌) తగ్గడం కొంత ఊరటనిచ్చే విషయం. 2015లో 40 ఉండగా 2023 నాటికి అది 25కి పడిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad