Jharkhand Elections|ఝార్ఖండ్ రాష్ట్రంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. 43 నియోజకవర్గాలకు తొలి విడతలో పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 60శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.
ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ దంపతులు రాజధాని రాంచీలోని ఓ పోలింగ్ బూతులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ధోనీని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య ధోనీ దంపతులకు పోలీసులు రక్షణ కల్పించారు. అలాగే సీఎం హేమంత్ సోరెన్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఓటు వేశారు. కాగా ఝార్ఖండ్‌తో పాటు కేరళలోని వయనాడ్ లోక్‌సభతో పాటు పలు రాష్ట్రాల్లోనూ ఉపఎన్నికలు జరిగాయి.రెండో విడత పోలింగ్ మహారాష్ట్ర ఎన్నికలతో పాటు నవంబర్ 20న జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న విడుదల కానున్నాయి.