జనరల్ ఎలక్షన్స్ పోలింగ్ స్టార్ట్ అయింది. 21 రాష్ట్రాల్లో ఈ ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమైంది. 102 పార్లమెంట్ స్థానాల్లో ఈ తొలి దశ పోలింగ్ లో ప్రముఖులంతా ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తొలి దశ పోలింగ్ ఇక్కడే..
తమిళనాడులో 39, రాజస్థాన్ 12, ఉత్తర్ ప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 6, ఉత్తరాఖండ్ 5, అరుణాచల్ ప్రదేశ్ 2, మేఘాలయ 2, అస్సాంలో 5, మహారాష్ట్రాలో 5, బిహార్ లో 4, వెస్ట్ బెంగాల్ 3, మణిపూర్ 2, త్రిపుర 1, జమ్మూకశ్మీర్ లో 1, ఛత్తీస్ గఢ్ లో 1, అండమాన్ నికోబార్ ఐల్యాండ్ 1, మిజోరం 1, నాగాల్యాండ్ 1, పుదుచ్చేరి 1, సిక్కిం 1, లక్షద్వీప్ 1 పార్లమెంట్ స్థానాల్లో ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది.
ఉదయం 9 గంటలకు తమిళనాడులో 8.2 శాతం, రాజస్థాన్ లో 10.7 శాతం, ఉత్తర్ ప్రదేశ్ లో 12.2 శాతం, మధ్యప్రదేశ్ లో 14.1 శాతం పోలింగ్ నమోదైంది.
ప్రముఖ లీడర్స్..
ఈరోజు తొలి దశ పోలింగ్ లో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్ తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 20 స్థానాల్లో ముఖ్యమైన ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నారు. నితిన్ గడ్కరీ, జితేంద్ర సింగ్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘావాల్, సంజీవ్ బల్యాన్, తమిళి సై సౌందర్ రాజన్, కనిమొళి, అన్నామలై, గౌరవ్ గోగోయ్, సర్బానంద సోనోవాల్ ఈరోజు ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుల్లో కొందరు.
450 మంది కోటీశ్వరులు
1,625 మంది అభ్యర్థులు ఈరోజు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో 450 మంది కోటీశ్వరులే కావటం మరో హైలైట్. వీరిలో135 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు.
7 దశల్లో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో ఇది తొలి దశ.