Janardhan Reddy Political Party: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీ ప్రకటించారు. జనార్దన్ రెడ్డి ఆదివారం బెంగళూరు నగరంలోని తన స్వగృహం ‘పారిజాత’లో విలేకరులతో మాట్లాడుతూ కొత్త పార్టీ ‘కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష’తో రాజకీయాల్లో తన ‘సెకండ్ ఇన్నింగ్స్’ ప్రారంభిస్తానని చెప్పారు.
జనార్దన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక రాజకీయాల్లో పురోగమనమే నా అసలు లక్ష్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లడమే నా లక్ష్యం. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకునేలా పార్టీని ఏర్పాటు చేస్తానని అన్నారు. తమ పార్టీ కర్నాటక ప్రజల హృదయాలను గెలుచుకుంటుందని జనార్దన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
మా పార్టీ నుంచి అభ్యర్థులు ఏఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారో త్వరలో తెలియజేస్తానని జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తామన్నారు.