Saturday, November 15, 2025
HomeTop StoriesDiabetes: డయాబెటిస్‌ ముప్పును ముందే గుర్తించవచ్చు.. ఐఐటీ బాంబే అధ్యయనం వెల్లడి

Diabetes: డయాబెటిస్‌ ముప్పును ముందే గుర్తించవచ్చు.. ఐఐటీ బాంబే అధ్యయనం వెల్లడి

IIT Bombay Research on Diabetes Risk: డయాబెటిస్‌.. ప్రస్తుతం అత్యధికంగా భారతీయులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. మధుమేహం కారణంగా శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతూ వారి జీవక్రియను దెబ్బతీస్తోంది. అయితే ఇప్పటివరకూ షుగర్‌ వ్యాధిని ఫాస్టింగ్‌ బ్లడ్‌ ద్వారా మాత్రమే వైద్యులు గుర్తిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ వ్యాధి ముప్పును లక్షణాలు గుర్తించవచ్చట. ఇందుకు సంబంధించి ఐఐటీ- బాంబే పరిశోధకులు కొత్త మార్గాన్ని కనుగొన్నారు.

- Advertisement -

మధుమేహం ముప్పును ముందే గుర్తించడానికి వీలుగా ఐఐటీ బాంబే పరిశోధకులు కీలక పరిశోధన చేశారు. రక్తంలో దాగి ఉండే కొన్ని ప్రత్యేక జీవ అణువులను- Bio Markers విశ్లేషించడం ద్వారా డయాబెటిస్‌ను ముందుగానే పసిగట్టవచ్చని అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన భవిష్యత్తులో తగిన చికిత్సలు అందించడానికి దోహదపడుతుంది. ఈ పరిశోధన వివరాలు ‘జర్నల్ ఆఫ్ ప్రొటియోమ్ రీసెర్చ్’లో ప్రచురితమయ్యాయి.

Also Read: https://teluguprabha.net/national-news/congress-rashid-alvi-counters-shashi-tharoor-nepotism/

ప్రస్తుతం భారత్‌లో 101 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నారు. మరో 136 మిలియన్ల మంది ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నట్లు వెల్లడైంది. దీంతో భారత్‌ను ‘ప్రపంచ డయాబెటిస్ రాజధాని’గా పిలుస్తున్నారు. డయాబెటిస్ కేవలం హై షుగర్‌ సమస్య మాత్రమే కాదు.. అది శరీరం మొత్తాన్ని ప్రభావితం చేసే విస్తృతమైన జీవక్రియ రుగ్మతగా వైద్యులు చెబుతున్నారు.

అయితే సాధారణంగా చేసే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, హెచ్‌బీఏ1సీ వంటి పరీక్షలు మధుమేహం వ్యాధి తీవ్రతలో కొంత భాగాన్ని మాత్రమే గుర్తిస్తాయి. ఈ నేపథ్యంలో ఐఐటీ బాంబే చేసిన పరిశోధనల్లో కీలక విషయాన్ని గుర్తించారు. ‘మెటబోలోమిక్స్’ అనే ఆధునిక పద్ధతిని ఉపయోగించి రక్తంలోని మెటబోలైట్స్(సూక్ష్మ అణువుల) సరళిని అధ్యయనం చేయగా.. శరీర కణాల్లో జరిగే రసాయనిక మార్పులను ఈ మెటబోలైట్స్ ప్రతిబింబిస్తాయని వెల్లడైంది. వీటిని విశ్లేషించడం ద్వారా వ్యాధి లక్షణాలు కనిపించడానికి ఏళ్ల ముందే శరీరంలో జరిగే మార్పులను గుర్తించవచ్చని తేలింది.

Also Read: https://teluguprabha.net/national-news/eps-95-big-update-what-will-be-the-minimum-pension-when-it-will-be-implemented/

2021 జూన్ నుంచి 2022 జూలై మధ్య హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నుంచి 52 మంది వాలంటీర్ల రక్త నమూనాలను పరిశోధకులు సేకరించారు. వీరిలో 15 మంది ఆరోగ్యవంతులు, 23 మంది టైప్ 2 డయాబెటిస్ రోగులు, 14 మంది డయాబెటిస్ కారణంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వారి రక్త నమూనాలను విశ్లేషించగా, ఆరోగ్యవంతులతో పోలిస్తే డయాబెటిస్‌ రోగుల్లో 26 మెటబోలైట్స్ భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు.

వీటిలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ వంటివి సాధారణంగానే ఉన్నాయి. అయితే వాలెరోబెటైన్, రైబోథైమిడిన్ వంటి కొన్ని కొత్త అణువులను గుర్తించారు. వీటికి డయాబెటిస్‌తో సంబంధం ఉన్నట్లు మొదటిసారిగా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనలో మరో కీలక విషయం గుర్తించారు. డయాబెటిస్ వల్ల కిడ్నీలకు కలిగే ముప్పును కూడా ఈ పద్ధతి ద్వారా గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల రక్తంలో అరబిటాల్, మైయో-ఐనోసిటాల్ వంటి 7 రకాల మెటబోలైట్స్ స్థాయిలు క్రమంగా పెరుగుతున్నాయని వెల్లడైంది. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో పేరుకుపోయే 2PY అనే విషపూరిత సమ్మేళనాన్ని కూడా గుర్తించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad