Jiang Zemin : చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన లుకేమియా, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బుధవారం మధ్యాహ్నాం 12.13 గంటలకు షాంఘై నగరంలో తుదిశ్వాస విడిచినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ఆయన వయస్సు 96 సంవత్సరాలు. అధికార కమ్మూనిస్టు పార్టీ, పార్లమెంట్, కేబినెట్‌తో పాటు ఆ దేశ ఆర్మీ కూడా జియాంగ్ జెమిన్ మరణంపై సంతాపం తెలిపింది. ఆయన మృతి తమకు తీరని లోటు అని పేర్కొంది
1926లో జియాంగ్ జెమిన్ జన్మించారు. కాలేజీ రోజుల్లో సీసీపీ(ccp)లో చేరి.. తన చరిష్మా కారణంగా పార్టీలో ఎదిగారు. 1985లో షాంఘై మేయర్ గా ఎన్నికైయ్యాడు. 1989లో టియాన్‌మెన్ స్క్వేర్ ఘటన తరువాత డెంగ్ షావోపింగ్ నుంచి జెమిన్ అధికారం చేపట్టారు. అంతర్జాయంగా దెబ్బతిన్న చైనా పరపతిని తిరిగి గాడినపెట్టిన ఘనత ఆయనకే చెందుతుంది. 2002లో ఆయన అధ్యక్షుడిగా పదవి విరమణ చేసేనాటికి చైనా దాదాపుగా సూపర్ పవర్ హోదాను అందుకుంది.