చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నేటితో ముగిసింది. దీంతో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించునున్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం 10 గంటలకు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది.
Also Read : ‘ఓబీసీలను విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు’
జనవరి 2019 జనవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ఖన్నా.. ఎన్నో చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో కీలక పాత్ర పోషించారు. ఈవీఎంల వినియోగాన్ని సమర్థించడం, ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయడం, ఆర్టికల్ 370 రద్దును సమర్థించడం, మాజీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం వంటి అనేక మైలురాయి తీర్పులలో భాగంగా ఉన్నారు. రేపు ఆయన 51వ భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.