పేదింటి కుర్రోడు సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలో మెరిశాడు. ఆల్ ఇండియా 27వ ర్యాంకు సాధించి జిల్లాకే వన్నె తెచ్చాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయి కిరణ్ సివిల్ సర్వీస్ పరీక్షా ఫలితాలలో ఆల్ ఇండియా 27 ర్యాంకు సాధించారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పేదరికం అడ్డుకాదని సాయి కిరణ్ నిరూపించాడు. సాయి వరంగల్ నీట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగం చేస్తూనే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కు అటెండ్ అయ్యాడు.
సాయి కిరణ్ ప్రైమరీ విద్య వెలిశాలలోని సరస్వతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో, హైస్కూల్ విద్య తేజ హై స్కూల్, కరీంనగర్ లో ఇంటర్మీడియట్ ట్రినిటీ కళాశాలలో విద్యను అభ్యసించాడు. తల్లి ఇప్పటికీ బీడీ కార్మికురాలుగా పనిచేస్తుంది. తండ్రి కాంతయ్య చేనేత కార్మికునిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆ తర్వాత క్యాన్సర్ తో మృతి చెందాడు. సాయి అక్క స్రవంతి ప్రస్తుతం ఏ ఈ ఈ గా ఉద్యోగం చేస్తుంది. పేద కుటుంబంలో జన్మించినప్పటికీ పిల్లలిద్దరూ చదువుల్లో రాణిస్తూ పెద్ద ఉద్యోగాలు సాధించడం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.