Thursday, September 19, 2024
Homeనేషనల్Karnataka: అండర్ వేర్ లో 5 కేజీల రాళ్లు..కాళ్లకు ఐరన్ ప్లేట్లు !!

Karnataka: అండర్ వేర్ లో 5 కేజీల రాళ్లు..కాళ్లకు ఐరన్ ప్లేట్లు !!

కోటి విద్యలు కూటి కొరకే అని మనందరికీ తెలిసిన విషయమే. ఆ పొట్ట తిప్పలు అండర్ వేర్ లో 5 కేజీల రాళ్లు..కాళ్లకు ఐరన్ ప్లేట్లు పెట్టుకునేలా చేస్తోంది. ఇదంతా కర్నాటకలో సర్కారీ ఉద్యోగానికి వచ్చిన తిప్పలే. కనీస బరువు ఉంటేకానీ కర్నాటకలో ఆర్టీసీ ఉద్యోగం అప్లై చేయడానికి అర్హులు కారు. ఈనేపథ్యంలో బరువు తక్కువున్న అభ్యర్థులు ఇలా అండర్ వేర్ లో 5 కేజీల చొప్పున రాళ్లు వేసుకుని సెలక్షన్స్ కు వెళ్తున్నారు. మరికొందరు కాళ్లకు బరువైన ఐరన్ ప్లేట్స్ పెట్టుకుని కనీస బరువు ఉన్నట్టు అర్హత సంపాదించేస్తున్న కుంభకోణం కర్నాటకలో వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

కల్యాణ కర్నాటక రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో కొలువుల కోసం అభ్యర్థులు కనీసం 55 కేజీల బరువు ఉండాలి. కానీ బరువు తక్కువ ఉన్నవాళ్లు ఇలా అడ్డదారులు తొక్కి సెలెక్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనుమానం వచ్చిన అధికారులు చెక్ చేస్తే 8 మంది అభ్యర్థులు ఇలా శరీరంలో బరువులు పెట్టుకుని వచ్చారు. ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే కేఎస్ఆర్టీసీలో 1,619 డ్రైవర్ కం కండక్టర్ పోస్టులకు గానూ ఏకంగా 38,000 మంది అప్లై చేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News