Kasturi| తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సినీ నటి, బీజేపీ మహిళా నేత కస్తూరి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. హైదరబాద్లోని రాజేంద్రనగర్లో ఆమెను అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు చెన్నైలోని సిందతరిపేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం ఆ స్టేషన్లో ఆమెను విచారిస్తున్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరపర్చనున్నారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో తెలుగు వారిపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై తెలుగు సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం మధురై హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం కస్తూరి పిటిషన్ను కొట్టివేసింది. దీంతో పరారీలో ఉన్న కస్తూరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించగా.. హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆమెను అరెస్ట్ చేసి చెన్నైకు తరలించారు.