Friday, November 22, 2024
Homeనేషనల్Kasturi: తెలుగు జాతిపై తమిళ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు

Kasturi: తెలుగు జాతిపై తమిళ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు

Kasturi| బీజేపీ నాయకురాలు కస్తూరి.. తెలుగు జాతిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజుల కాలంలో తమిళులకు సేవలు చేసేందుకు తెలుగు వాళ్లు ఇక్కడికి వచ్చారని.. వాళ్లు కూడా ఇప్పుడు తమది తమిళ జాతి అని అంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

తమిళనాడులో స్థానికంగా నిర్వహించిన ఓ బ్రాహ్మణ సంఘాల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమిళనాడులోని అంతఃపురంలో మహిళలకు సేవలు చేసేందుకు తెలుగు వారు వచ్చారని తెలిపారు. వారు ఇప్పుడు తమది కూడా తమిళ జాతి అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. 300 ఏళ్ల క్రితం సేవ చేసేందుకు వచ్చిన వారే తమిళులు అయినప్పుడు ఇక్కడ బ్రాహ్మణులు ఎందుకు తమిళులు కారని ప్రశ్నించారు. తెలుగు మాట్లాడే వాళ్లకే ప్రభుత్వాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.

ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడే వారు ఉన్నారని చెప్పారు. బ్రాహ్మణులు చెప్పే మంచి మాటల వల్లే సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇతర ఆస్తులను లాక్కోవద్దని.. మహిళలపై మోజుపడొద్దని ఒకరి కంటే ఎక్కువ భార్యలు వద్దొన్నందుకు బ్రాహ్మణులపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందన్నారు. కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగు సంఘాలు ఆమె వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి.

దీంతో తన వ్యాఖ్యలపై కస్తూరి వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇదంతా తప్పుడు ప్రచారమని.. అసలు విషయాన్ని కట్ చేసి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొన్ని ఏళ్ల క్రితం తమిళనాడు వచ్చిన తెలుగు వారు మాత్రమే తాము తమిళులమని చెప్పుకుంటున్నారని.. కానీ బ్రాహ్మణులను మాత్రం తమిళులు కాదంటున్నారని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News