Kerala bus driver wears helmet: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పిలుపుతో దేశ వ్యాప్తంగా నేడు భారత్ బంద్ జరుగుతోంది. దీంతో బ్యాంకింగ్, రవాణా, పోస్టల్, ఇతర ప్రభుత్వ రంగాల సేవలకు అంతరాయం కలుగుతోంది. అయితే బంద్ దృష్ట్యా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కానీ ఓ బస్సు డ్రైవర్ మాత్రం ఒకవేళ ఆందోళనకారులు దాడి చేస్తే తనకు ఏం కాకుండా ఉండేందుకు హెల్మెట్ పెట్టుకుని బస్సు నడపడం ఆశ్చర్యానికి గురిచేసింది.
కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన షిబు థామన్ అనే బస్సు డ్రైవర్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హెల్మెట్‌తో విధులకు హాజరయ్యారు. పతనంతిట్ట నుంచి కొల్లాం మార్గంలో హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతున్నాడు. దీనిని బస్సు కండక్టర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. డ్రైవర్ ముందు జాగ్రత చర్యకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బంద్‌లో భాగంగా ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడితే తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో హెల్మెట్ ధరించాలన్న డ్రైవర్ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాట్ ఏ స్మార్ట్ ఐడియా అంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కేరళలో కార్మిక సంఘాట బంద్‌పై అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. యథావిథిగా బస్సులు నడిపిస్తోంది. సమ్మెల్యే పాల్గొనే ఉద్యోగులు, కార్మికులకు ఓరోజు జీతాన్ని కట్ చేస్తామని హెచ్చరించింది. కానీ ప్రభుత్వ హెచ్చరికలను మాత్రం కార్మిక సంఘాలు తోసిపుచ్చాయి. కార్మికులు సమ్మెలో పాల్గొంటారని స్పష్టం చేశాయి. దీంతో కేరళలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే బస్సు డ్రైవర్ భయంతో హెల్మెట్ పెట్టుకుని విధులకు హాజరయ్యారని చెబుతున్నారు.
Also Read: భారత్ బంద్.. ఏయే సేవలు నిలిచిపోనున్నాయి..?
కాగా కనీస వేతనం రూ.26,000 ఉండాలనే నిబంధనతో పాటు పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో దేశ వ్యాప్తంగతా 25 కోట్ల మంది పాల్గొంటున్నారు. కీలకమైన 10 ట్రేడ్ యూనియన్లు ఈ బంద్‌కు పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా విప్లవ భావజాలాలు అధికారంలో పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో బంద్ ప్రభావం అధికంగా ఉందని తెలుస్తోంది.


