భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత(India-Pakistan Tensions) పరిస్థితుల నేపథ్యంలో మీడియా ఛానెళ్లకు(Media Channels) కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే ఎయిర్ సైరన్‌లను ప్రసారం చేయొద్దని ఆదేశించింది. కేవలం మాక్ డ్రిల్ సమయంలో పౌరులకు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ విభాగాలు అడ్వైజరీ ఆదేశాలు జారీ చేశాయి. కాగా ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించి జాతీయ, ప్రాంతీయ మీడియా ఛానెళ్లు నాన్ స్టాప్‌గా కవరేజ్ ఇస్తున్న సంగతి తెలిసిందే.