బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ(Lal Krishna Advani)తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు.
- Advertisement -
కాగా గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. అఖండ భారత్‌లోని కరాచీలో జన్మించిన అద్వానీ సుదీర్ఘకాలం పాటు బీజేపీలో అగ్రనాయకుడిగా కొనసాగుతున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం పోరాటంలో కీలకపాత్ర పోషించారు.