Monday, November 17, 2025
Homeనేషనల్Madras HC: టీవీకేకి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు.. కరూర్‌ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తుకు నో పర్మిషన్

Madras HC: టీవీకేకి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు.. కరూర్‌ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తుకు నో పర్మిషన్

- Advertisement -

Madras HC On TVK Plea: టీవీకే పార్టీకి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. కరూర్ తొక్కిసలాట ఘటనను సీఐబీ దర్యాప్తునకు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తొక్కిసలాట ఘటన విచారణను సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని టీవీకే పిటిషన్ వేయగా.. హైకోర్టు అందుకు ససేమిరా అంది. కేసు దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున ప్రస్తుతానికి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు కోర్టును రాజకీయ వేదికగా మార్చవద్దంటూ న్యాయమూర్తి సున్నితంగా వారించారు. అసలు నీళ్లు, ఆహారం సదుపాయాలు లేకుండా సభ ఎలా నిర్వహించారని టీవీకేను హైకోర్టు ప్రశ్నించింది.

Also Read: https://teluguprabha.net/technology-news/under-20k-5g-smartphones-in-india/

రాజకీయాలకు కోర్టు వేదిక కాదు..

మరోవైపు, కరూర్​ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ నాయకురాలు ఉమా ఆనందన్​, బీజేపీ న్యాయవాది జీఎస్‌ మణి దాఖలు చేసిన పిటిషన్‌లను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా రాజకీయ పార్టీలకు న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, ఆంబులెన్స్‌ సేవలు, నిష్క్రమణ మార్గాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని సూచించింది. ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. మరోవైపు రాజకీయ పార్టీ నేతల ర్యాలీలపై ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (ఎస్​ఓపీ) రూపొందించే వరకు హైవేలపై ఏ పొలిటికల్​ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. కాగా, టీవీకే నామక్కల్‌ జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించడంలో టీవీకే పార్టీ ఎందుకు విఫలమైందని ఆయనను న్యాయమూర్తి ప్రశ్నించారు. కరూర్​ తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం అందించాలని కోరుతూ ఓ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై స్పందన కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

విజయ్‌పై డీఎంకే నేతలు ఫైర్​..

తొక్కిసలాటపై ఇటీవల విజయ్‌ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో తనను ఏదైనా చేయండి కానీ తన ప్రజల జోలికి వెళ్లొద్దంటూ సీఎం స్టాలిన్‌, డీఎంకే లక్ష్యంగా పలు కీలక విమర్శలు చేశారు. విమర్శలపై అధికార డీఎంకే పార్టీ చాలా తీవ్రంగా స్పందించింది. సినిమాల్లో లాగనే నిజ జీవితంలో కూడా విజయ్నటన పూర్తిగా విఫలమైందని పార్టీ ఆరోపించింది. బాధిత కుటుంబాలకు తమ డీఎంకే ప్రభుత్వం ఇప్పటికే పరిహారం చెల్లించిందని, కానీ నటుడు విజయ్ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. తనను అరెస్టు చేయాలంటూ సవాలు విసురుతూ, 41 మంది అమాయక ప్రజలు మరణించిన అంశాన్ని దారి మళ్లించేందుకు విజయ్ప్రయత్నిస్తున్నారని డీఎంకే ఆరోపించింది. తొలుత డిసెంబరు 13న షెడ్యూల్చేసిన పర్యటనను ముందుకు జరపడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తంచేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad