Friday, November 22, 2024
Homeనేషనల్MVA Manifesto: మహారాష్ట్ర ఎన్నికలు.. మహా వికాస్ హామీలు ఇవే..

MVA Manifesto: మహారాష్ట్ర ఎన్నికలు.. మహా వికాస్ హామీలు ఇవే..

MVA Manifesto| మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Maharastra Elections) మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి. 288 మంది శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో నవంబరు 20న ఒకేవిడతలో పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయగా.. తాజాగా మహా వికాస్ కూటమి(MVA) తన మేనిఫెస్టో విడుదల చేసింది. కులగణన, రిజర్వేషన్లు, వ్వవసాయం, ఆరోగ్యంపై ప్రధానం హామీలు ఇచ్చింది.

- Advertisement -

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇక ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీ-ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ తమ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్‌ట్రంలో కులగణన నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న 50శాతం రిజర్వేషన్లను మరింత పెంచుతామని హామీ ఇచ్చారు. వివిధ వర్గాల ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు కులగణన ఉపయోగపడుతుందన్నారు. తమ మేనిఫెస్టో ద్వారా ఏడాదికి సుమారు రూ.3.50 లక్షలు ప్రజలకు ఆదా అవుతుందని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో అమలవుతున్న రూ. 25 లక్షల ఆరోగ్య బీమాను మహారాష్ట్రలోనూ ప్రారంభిస్తామని తెలిపారు.

వీటితో పాటు ప్రధాన హమీలు ఇవే..

మహాలక్ష్మి యోజన కింద మహిళలకు ప్రతి నెలా రూ.3,000
రూ. 3 లక్షల వ్యవసాయ రుణమాఫీ
రుణాలను తిరిగి చెల్లించే రైతులకు రూ. 50 వేల సహాయం
గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేసిన నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News