Wednesday, November 20, 2024
Homeనేషనల్Exit Polls | మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ హవా

Exit Polls | మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ హవా

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కొద్దిసేపటి క్రితం ముగిసాయి. దీంతో సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) ను విడుదల చేశాయి. రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ, విపక్ష ఇండి కూటమి పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమిదే విజయం అని చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్, సీఎన్ఎన్ – న్యూస్ 18, మాట్రైజ్ సంస్థలు ఓటర్లు ఎన్డీఏ కూటమి వైపే ఉన్నట్లు అంచనా వేశాయి.

- Advertisement -

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా.. మెజార్టీ మార్కు 145. అధికారంలో ఉన్న మహాయుతిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. విపక్ష ఎంవీఏ (మహా వికాస్ అఘాడీ) లోని కాంగ్రెస్ 101, శివసేన 95, ఎన్సీపీ (SP) 86 సీట్లలో పోటీ చేయగా, బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి. కాగా గెలుపుపై కొద్దిసేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్ర

పీపుల్స్ పల్స్: మహాయుతి- 182, ఎంవీఏ- 97, ఇతరులు – 9
సీఎన్ఎన్-న్యూస్18: మహాయుతి- 154, ఎంవీఏ- 128, ఇతరులు- 6
మాట్రిజ్: మహాయుతి- 150-170, ఎంవీఏ- 22- 110-130, ఇతరులు- 8-10
పీ-మార్క్: మహాయుతి- 137-157, ఎంవీఏ- 2- 126-146, ఇతరులు- 2-8
లోక్ శాహీ మరాఠీ: మహాయుతి- 128-142, ఎంవీఏ- 125-140, ఇతరులు- 18-23

జార్ఖండ్

పీపుల్స్ పల్స్: ఎన్డీయే- 46-58, ఇండి కూటమి- 24-37, ఇతరులు- 6-10
టైమ్స్ నౌ-జేవీసీ: ఎన్డీయే- 40-44, ఇండి కూటమి- 20-40, ఇతరులు- 1-1
మాట్రిజ్: ఎన్డీయే- 42-47, ఇండి కూటమి- 25-30, ఇతరులు- 1-4

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News