ప్రయాగ్‌రాజ్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా(Kumbh Mela)లో ఇటీవల కొన్ని దుర్ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన కొన్ని తొక్కిసలాట ఘటనల్లో కొంతమంది మృతి చెందిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కుంభమేళాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది మహా కుంభ్ కాదు… మృత్యు కుంభ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కుంభమేళా అంటే తనకు గౌరవం ఉందని.. కానీ కుంభమేళాకు వెళ్లి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. కేవలం వీఐపీల కోసమే ఏర్పాట్లు చేసిందని ఆరోపించారు. తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎందుకు తగిన భద్రత ఏర్పాట్లు చేయలేదని ఆమె నిలదీశారు. కాగా జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26వరకు జరనుంది. ఇప్పటికే 50కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ కుంభమేళా నిర్వహణ ద్వారా యూపీ ప్రభుత్వానికి రూ.3లక్షల కోట్ల ఆదాయం వచ్చింది.