ఛత్తీస్‌గఢ్-ఒడిశా(Chhattisgarh-Odisha) సరిహద్దులోని అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. మావోయిస్టుల లక్ష్యంగా సరిహద్దు జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్(Encounter) నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. జనవరి 19వ తేదీ రాత్రి నుంచి జరుగుతున్న ఈ ఆపరేషన్‌లో మొత్తం 14 మంది మావోయిస్టులు మృతి చెందారని గుర్తించారు. అలాగే భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ జయరామ్, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు. చలపతిపై రూ.కోటి రివార్డు ఉండటం గమనార్హం.