ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పలు గుడారాల్లో మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
- Advertisement -
ఓ గుడారంలో సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు పక్క గుడారాలకు అంటుకోవడంతో పాటు దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.