Monday, November 17, 2025
Homeనేషనల్Vairamuthu: రాముడిపై కవి వైరముత్తు వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ

Vairamuthu: రాముడిపై కవి వైరముత్తు వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ

Row Over Tamil Poet’s “Lord Ram Lost His Mind” Remarks : ప్రముఖ తమిళ గీత రచయిత, కవి వైరముత్తు శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. కంబన్ పేరిట నిర్వహించిన సాహిత్య కార్యక్రమంలో వైరముత్తు మాట్లాడుతూ, శ్రీరాముడు సీతను కోల్పోయిన తర్వాత “మతిస్థిమితం కోల్పోయాడు” అని వ్యాఖ్యానించారు. దీనిపై భారతీయ జనతా పార్టీ భగ్గుమంది. వైరముత్తు హిందువుల మనోభావాలను దెబ్బదీస్తున్నారని ఆరోపించింది.

- Advertisement -

ఏం జరిగిందంటే..

“సీతను కోల్పోయిన తర్వాత రాముడు తాను ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చేసిన నేరాలను ఐపీసీ సెక్షన్ 84 కింద నేరాలుగా పరిగణించరు. కంబన్‌కు ఈ చట్టాలు తెలియకపోవచ్చు, కానీ అతనికి సమాజం, మనిషి మనసు గురించి తెలుసు” అని వైరముత్తు అన్నారు. ఈ వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, “ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యమేనా?” అని ప్రశ్నించారు. బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి, వైరముత్తును ‘ఒక అవివేకి’, ‘మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి’గా అభివర్ణించారు. గతంలో కూడా వైరముత్తు అండాల్ అనే హిందూ దేవతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయని బీజేపీ గుర్తుచేసింది.

అయితే, వైరముత్తు సన్నిహితులు ఈ వివాదాన్ని ఖండించారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని, ఇది కేవలం కంబన్ కవిత్వాన్ని విశ్లేషించే ప్రయత్నమేనని, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం దీని ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad