Saturday, October 5, 2024
Homeనేషనల్MP, Rajasthan, Chattisgarh CMs: కొత్తోళ్లకే సీఎంలుగా ఛాన్స్, మోడీ న్యూ స్ట్రాటెజీ

MP, Rajasthan, Chattisgarh CMs: కొత్తోళ్లకే సీఎంలుగా ఛాన్స్, మోడీ న్యూ స్ట్రాటెజీ

నెక్ట్స్ పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా..

మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో కొత్త ముఖాలకు ముఖ్యమంత్రులుగా ఛాన్స్ ఇచ్చే ప్రయత్నంలో బీజేపీ అధిష్టానం ఉంది.  పాత తరం నాయకులను పక్కనపెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇస్తూ, సరికొత్త క్యాబినెట్, సర్కారును ఇచ్చే ప్రయత్నంలో ఉన్న కమలనాథులు సెకెండ్ జనరేషన్ లీడర్స్ కే గోల్డెన్ ఛాన్స్ అంటోంది.  ఇందులో భాగంగా మధ్యవయస్కులు, రాజకీయ అనుభవం ఉన్న క్లీన్ ఇమేజ్ ఉండి, జనాకర్షణ ఉన్న నేతల పేర్లను సీరియస్ గా పరిశీలిస్తోంది.  వృద్ధ నేతలు, పాతతరం పాలన, అవినీతి-బంధుప్రీతి ఆరోపణలను అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ కొత్త తరం-కొత్త పాలన-కొత్త నేతలు అనే మంత్రంతో పార్టీకి కొత్త రక్తం ఎక్కించే పనిలో హైకమాండ్ ఉంది.

- Advertisement -

వాజ్పేయి-అద్వానీ ఇమేజ్ కాదు..

దీనికి తోడు పాత తరం నేతలే గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారు. పైగా వీరంతా వాజ్ పేయి-అద్వానీల హయాంలో ఎదిగిన నేతలు. ఇన్ని దశాబ్దాల తరువాత కూడా మోడీ-షా తమ ముద్రను పార్టీపై పూర్తిస్థాయిలో వేయకపోవడానికి ప్రధాన కారణమే రాజే, శివరాజ్ వంటి పాతతరం నేతలు. అందుకే వీరిని తప్పించి సరికొత్త ఇమేజ్ తో పార్టీని తమ స్టైల్లో, తమ మార్కుతో నడిపించాలంటే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయింది. పార్టీపై, రాష్ట్రాల పాలనపై పూర్తిస్థాయి పట్టు సంపాదించాలన్నా, తమ కనుసన్నల్లో ఢిల్లీ నుంచి గల్లీదాకా నేతలపై అజమాయిషీ చేయాలన్నా ఇదే సరైన మార్గంగా మోడీ-షా భావిస్తున్నారు. అందుకే మూసధోరణికి స్వస్తి పలికి నయా ముఖాలకు రెడ్ కార్పెట్ వేసి, అందలం ఎక్కించి, పార్టీపై ఉన్న కొన్ని ఆరోపణలు తుడిచిపెట్టే వ్యూహాన్ని అమలుజరిపే పనుల్లో ఉన్నారు.

క్లీన్ ఇమేజ్, న్యూ బ్రాండ్

2024 ఎలక్షన్సే టార్గెట్ గా ఈ నయా పొలిటికల్ ఇంజినీరింగ్ ఫార్ములా ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను నింపుతుందని మోడీ-షాల ద్వయం గట్టిగా నమ్ముతోంది.  అందుకే ఎన్నికలు గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ సీఎం పేర్లను ప్రకటించి, హడావిడిగా సర్కారు ఏర్పాటు చేసేందుకు ఏమాత్రం మొగ్గు చూపకుండా సావధానంగా సరికొత్త ముఖాలను పొలిటికల్ స్క్రీన్ పై తెచ్చే పనిలో ఎక్సర్ సైజ్ చేస్తోంది.  ఇందుకు మూడు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ అబ్జర్వర్స్ ను నియమించి, ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ చేపట్టనుంది.  బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ఈమేరకు ఇప్పటికే ఢిల్లీలో మారథన్ మీటింగ్స్ ను పూర్తిచేసింది.  సీఎంలు ఎవరన్నదానిపై ఇంకా కొలిక్కి రాకపోయినా ఆయా రాష్ట్రాల్లోని కొత్తగా ఎంపికైన బీజేపీ ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు కొత్త సీఎంలను ఎన్నుకునే పనిలో మోడీ, షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నద్దా పలు దఫాలుగా ఇప్పటికే భేటీలు వేశారు.  ఎంపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ బీజేపీ ఇంఛార్జీలతో వరుస సంప్రదింపులు కొనసాగుతున్నాయి. 

చౌహాన్ కు చెక్?

మధ్యప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్-జ్యోతిరాదిత్య సింధియా-నరేంద్ర సింగ్ తోమర్ తోపాటు మరో సీనియర్ నేత కైలాష్  విజయవర్గీయ సీఎం రేసులో ఉన్నారు.

రాజేకి రాం రాం?

ఇక రాజస్థాన్ విషయానికి వస్తే మాజీ సీఎం వసుంధరా రాజే, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, యూనియన్ మినిస్టర్స్ గజేంద్ర సింగ్ షెకావత్-అర్జున్ రాం మెఘ్వాల్, స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ సీపీ జోషి, దియా కుమారి, మహంత్ బాలక్నాథ్ వంటి వారు సీఎం సీటు కోసం ప్రాబబుల్స్ గా ఉన్నారు.

ఇంకెంత కాలం రమణ్ సింగ్ ఇమేజ్?

ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఇక్కడ మాజీ సీఎం రమణ్ సింగ్ తోపాటు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ రావ్, అపోజిషన్ లీడర్ గా వ్యవహరించిన ధర్మలాల్ కౌశిక్, మాజీ ఐఏఎస్ అధఇకారి ఓపీ చౌధరీ సీఎం కుర్చీ కోసం పాకులాడుతున్నారు.  మరి వీరిలో ఎవరికి సీఎం కుర్చీ దక్కుతుందన్నది తేలాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందేనని స్పష్టమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News