Tuesday, October 8, 2024
Homeనేషనల్Nasa Released Photos: చంద్రుడిపై ఎలాఉంటుందో చూస్తారా? ఫొటోలు విడుద‌ల చేసిన నాసా

Nasa Released Photos: చంద్రుడిపై ఎలాఉంటుందో చూస్తారా? ఫొటోలు విడుద‌ల చేసిన నాసా

Nasa Released Photos: 50ఏళ్ల త‌రువాత చంద్రునిపైకి మ‌నుషులు కాలుమోపేందుకు నాసా ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేప‌ట్టిన విష‌యం విధిత‌మే. ఇందులో భాగంగా మాన‌వ‌ర‌హిత రాకెట్ ఆర్టెమిస్‌-1ను గ‌త ప‌దిరోజుల క్రితం నాసా విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. ఆర్టెమిస్ చంద్రుడి ఉప‌రిత‌లానికి చేరి ఆరు రోజులు అవుతుంది. ఆర్టెమిస్‌తో చంద్రుడిపై అందాల‌ను ఫొటోలు తీసేందుకు నాసా ఓరియ‌న్ స్పేస్‌క్రాప్ట్ ను కూడా చంద్రుడి మీద‌కు పంపించిన విష‌యం విధిత‌మే. తాజాగా ఓరియ‌న్ స్పేస్‌క్రాప్ట్ చంద్రుడి ఉప‌రిత‌లానికి అతిస‌మీపంలో నుంచి తీసిన ఫొటోల‌ను పంపించింది.

- Advertisement -
నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసిన ఫొటో

ఈ ఫొటోల‌ను నాసా త‌న ఇస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. చంద్రుడికి సుమారు 128 కిలో మీట‌ర్ల ఎత్తు నుంచి ఓరియ‌న్ స్పేస్‌క్రాప్ట్ తీసిన ఫొటోల్లో చంద్రుడి ఉప‌రితలం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. జాబిలిపై వేర్వేరు సైజుల్లో గుంత‌లు, పెద్ద పెద్ద లోయ‌లు ఉన్నాయి. అయితే గుంత‌లు ప‌డ‌టానికి కార‌ణం గ్ర‌హ‌శ‌క‌లాలు ఢీకొన‌డం వ‌ల్లేన‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. మొత్తం నాలుగు ఫొటోల‌ను నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీనిలో మొద‌టి చిత్రంలో.. చంద్రుని ఉపరితలం నలుపు, తెలుపు ఫోటో దాని ఉపరితలంపై వివిధ పరిమాణాల క్రేటర్‌లను చూపుతుంది. చిత్రం యొక్క ఎడమ వైపున చంద్రుడు బూడిద రంగు షేడ్స్‌లో కనిపిస్తాడు. ఫోటో యొక్క కుడి మూడవ భాగంలో ఖాళీ నలుపుతో కనిపిస్తుంది

నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటో

నాసా పంపించిన రెండ‌వ చిత్ర‌లో.. చంద్రుడిని క్లోజప్‌లో ఈ ఫొటో తీసిన‌ట్లుంది. ఇందులో నలుపు భాగాన్ని తక్కువ చూపిస్తుంది. మూడ‌వ, నాలుగు చిత్రాల్లో చంద్రుడిపై పెద్ద గోతివ‌లే క‌నిపిస్తుంది. అయితే గ్రహశకలం, ఉల్క డీకొన‌డం వ‌ల్ల‌ చంద్రుడిపై పెద్ద‌పెద్ద గోతులు ఏర్ప‌డ్డాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

View this post on Instagram

A post shared by NASA (@nasa)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News