ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు 14 కోట్లకు పైగా ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు ఈ కుంభమేళాకు హాజరవుతుండటంతో.. పలు వ్యాపారాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇక్కడికి వెళ్లిన భక్తులకు ఓ యువకుడు వేప పుల్లలు అమ్ముతూ.. కేవలం 4 రోజుల్లో రూ.40 వేలకు పైగా సంపాదించాడంట. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే. ఓ ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ పుల్లలు అమ్ముతున్న వ్యక్తిని ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశంగా చెప్పబడే మహా కుంభమేళా 2025కి కోట్లాది మంది భక్తులు హాజరవుతున్నారు. అదే సమయంలో చాలా మందికి ఇది అపారమైన ఆర్థిక అవకాశాలను అందిస్తుంది. ఇటీవల ఓ టీ వ్యాపారి.. తన రోజువారీ సంపాదన 10వేలు అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు మరో యువకుడు పళ్లు తోముకునే వేప పుల్లలు అమ్మి వేలల్లో సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొత్త వ్యాపార ఆలోచనలు: 144 సంవత్సరాలకు ప్రయాగ్‌రాజ్ లో జరిగే ఈ కుంభమేళాకు.. ఈ సారి 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాదాపు రూ.2 లక్షల కోట్లు సంపాదిస్తుంది. ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. అదేవిధంగా ఇది చాలా మందికి డబ్బు సంపాదించే అవకాశాలను సృష్టిస్తుంది. ఈ మతపరమైన కార్యక్రమం కొంతమంది చిన్న వ్యాపారులకు మంచి డబ్బు సంపాదించే అవకాశాన్ని ఎలా అందిస్తుందో చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి.
వేప పుల్లల అమ్మకం: ఈ క్రమంలోనే వేప పుల్లల అమ్ముతున్న వ్యక్తి వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను ఆదర్శ్ తివారీ అప్లోడ్ చేశారు. ఆ వ్యక్తి వేప పుల్లల అమ్మి.. తన ఆదాయం గురించి చెప్పకపోతే వైరల్ అయ్యేది కాదు.. కానీ వేప పుల్లలను అమ్మడం ద్వారా భారీ ఆదాయం వస్తుందో తెలిపాడు. నిజానికి ఈ యువకుడి సంపాదన ఎవరి ఊహకు అందని విధంగా ఉంది. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
పెట్టుబడి లేని వ్యాపారం: ఈ వేప పుల్లల అమ్మకం ఎంతో లాభదాయకం.. తన స్నేహితురాలు ఇచ్చిన ఐడియా మేరకు వేప పుల్లలను అమ్ముతున్నట్లు సదరు యువకుడు తెలిపాడు. ఐదు రోజుల్లో దాదాపు 45 వేల వరకు సంపాదించినట్లు తెలిపాడు. అంటే రోజుకు సులభంగా 9 నుంచి 10 వేల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. మరింత కష్టపడితే రోజుకి 20 సంపాదించే అవకాశం ఉందని ఆ యువకుడు ఆశాభావం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఆలోచన ఉండాలే కానీ.. వ్యాపారానికి అనర్హం ఏదీ కాదని నిరూపించాడు ఈ యువకుడు.