వైట్ కాంతా వర్క్ శారీలో కనిపించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. మరికాసేపట్లో పార్లమెంట్ లో బడ్జెట్ ను ఆమె ప్రవేశపెడతారు. 2021 నుంచి పేపర్లెస్ బడ్జెట్ పెడుతున్న కేంద్రం ఈసారి మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రవేశపెడతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. పేదలు, మధ్యతరగతి వాళ్లకు అనువుగా ఉండేలా బడ్జెట్ ఉండబోతున్నట్టు ప్రధాని మోడీ స్వయంగా లీకులు ఇవ్వటమే ఇందుకు కారణం.
- Advertisement -
వరుసగా 8వసారి బడ్జెట్ పెడుతున్న మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్ కాగా నిర్మలా సీతారామన్ ఆయన రికార్డుకు దగ్గర్లో ఉండటం విశేషం.