Tuesday, July 15, 2025
Homeనేషనల్Waqf Bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ పదవీ కాలం పొడిగింపు

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ పదవీ కాలం పొడిగింపు

Waqf Bill| పార్లమెంట్ సమావేశాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(Parliamentary Committee) పదవీ కాలాన్ని పొడిగిస్తూ లోక్‌సభ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు వరకు దీనిని పొడగిస్తూ లోక్ సభలో కమిటీ చైర్మన్, బీజేపీ నేత జగదాంబిక పాల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు.

- Advertisement -

కాగా గత వర్షాకాల సమావేశాల్లో వక్ఫ్ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికార, విపక్ష ఎంపీలతో కలిపి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ శీతాకాల సమావేశాల్లో కమిటీ తన నివేదికను పార్లమెంట్‌కి సమర్పించాల్సి ఉంది. అయితే ప్రతిపక్షాలతో పాటు పలువురు బీజేపీ ఎంపీలు కమిటీ కాల పరిమితిని పొడిగించాలని కోరారు. అలాగే ప్రస్తుత వక్ఫ్ చట్టంలో ప్రతిపాదించిన సవరణలు ముస్లింల మత పరమైన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. దీంతో బడ్జెట్ సమావేశాల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News