Sunday, November 16, 2025
Homeనేషనల్Patna: మోడీకి డబుల్ డిజిట్టే దిక్కంటున్న నితీష్

Patna: మోడీకి డబుల్ డిజిట్టే దిక్కంటున్న నితీష్

రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దక్కేది డబుల్ డిజిట్ నంబరే అంటూ బిహార్ సీఎం నితీష్ కుమార్ జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ చేతులు కలపి పోరాడాలంటూ నితీష్ పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫ్రంట్ గా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే బీజేపీని మట్టికరిపించి సంఖ్యాబలాన్ని 100 లోపుకి కుదించవచ్చన్నారు. తాను చెప్పిన సలహా పాటించకపోతే ఏమవుతుందో అందరికీ బాగా తెలుసని పరుషంగా వ్యాఖ్యానించారు నితీష్. పట్నాలో జరిగిన సీపీఐఎం 11వ జనరల్ కన్వెన్షన్ లో ప్రసంగించిన నితీష్ తనకు ప్రధాని కావాలనే ఉబలాటం ఏమీ లేదని పునరుద్ఘాటించారు. తాను ప్రధాని పదవి రేసులో లేనని తేల్చిచెప్పారు కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad